- LPG, GST, మ్యూచువల్ ఫండ్స్‌లో కీలక మార్పులు
- గ్యాస్ ధరలు, ఫోన్ కాల్స్, పెట్టుబడులపై ప్రభావం
- మీ జేబుపై ప్రభావం చూపే మార్పులివే
- నవంబర్ 1 నుంచి ఏం మారనుందంటే?
New Rules November 1 : అక్టోబర్ నెల ముగిసింది.. నవంబర్ నెల వచ్చేస్తోంది. అయితే కొత్త నెలతో పాటు సామాన్యులు, పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ ధరలు, జీఎస్టీ నిబంధనలు, మ్యూచువల్ ఫండ్స్, మొబైల్ కాల్స్‌కు సంబంధించి కొత్త మార్పులు రానున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం..
ఎల్పీజీ గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయా? :
ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు (New Rules November 1) ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నవంబర్ 1న 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,810గా ఉండగా, గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర రూ.942గా ఉంది.
జీఎస్టీ రిటర్నుల విధానం ఈజీ :
జీఎస్టీ చెల్లింపుదారులకు కీలక మార్పులు ఉన్నాయి. GSTR-1, GSTR-1A, ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ (IFF) ఫారాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటి ముసాయిదాలను ప్రజల అభిప్రాయాల కోసం (myGov) పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నారు. కొత్త ఫారాలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రిటర్నుల దాఖలు, రీఫండ్ల ప్రక్రియను మరింత ఈజీ చేయనుంది..
ఫోన్ కాల్ చేస్తే పేరు కనిపిస్తుంది :
నవంబర్ 1 నుంచి కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNP) సర్వీసుకు సంబంధించి టెలికాం ఆపరేటర్లు కొత్త నిబంధనలను అమలు చేయనున్నాయి. దీంతో ఫోన్‌కు కాల్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తి పేరు, నంబర్ రెండూ కనిపిస్తాయి. గుర్తు తెలియని కాల్స్‌ను గుర్తించడంతో పాటు యూజర్ల ప్రైవసీ పరంగా సేఫ్టీ ఉంటుంది.
Read Also :
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు కొత్త రూల్ :
సెబీ (SEBI) కొత్త నిబంధనల ప్రకారం.. మ్యూచువల్ ఫండ్ సంస్థల డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లను డిఫాల్ట్ ఆప్షన్‌గా ఉండనుంది. రెగ్యులర్ ప్లాన్ ఎంచుకునే వారికి అదనపు ఖర్చులపై ముందుగానే తెలియజేస్తారు. అలాగే లిస్టింగ్, డిస్క్లోజర్ నిబంధనల్లోనూ మార్పులు చేయనున్నారు. మొత్తంగా నవంబర్ నెలలో ఈ మార్పులు మీ ఖర్చులు, పెట్టుబడులు, రోజువారీ ఫోన్ వినియోగంపై ప్రభావం చూపనున్నాయి.
పింఛను నిబంధనలివే :
ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందాలంటే ప్రతి ఏడాది జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. దీనినే జీవన్ ప్రమాణ్ (Jeevan Pramaan) అని పిలుస్తారు. 80 ఏళ్లలోపు పెన్షనర్లు 2026 నవంబర్ 1 నుంచి ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చు. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అక్టోబర్ 1 నుంచే సమర్పించేందుకు అవకాశం ఉంది.
ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు నవంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. పెన్షనర్లు బ్యాంకు శాఖల్లో లేదా ఆధార్ ఆధారిత డిజిటల్ జీవన్ ప్రమాణ్ ద్వారా సమర్పించవచ్చు. గడువులోగా సమర్పించకపోతే ధృవీకరణ పూర్తయ్యే వరకు పెన్షన్ చెల్లింపుల్లో తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుంది.
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు :
ఆడిట్ పరిధిలోకి వచ్చే కొంతమంది పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ గడువు పొడిగించింది. 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు గడువును అక్టోబర్ 31 నుంచి నవంబర్ 21, 2026 వరకు పెంచింది.
ఈ వెసులుబాటు వ్యాపారాలు, నిపుణులు, కంపెనీలు, ఇతర పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది. ఆడిట్ నిబంధనల పరిధిలోకి వచ్చే వారు అదనపు సమయం ఉంటుంది. అయితే ఈ గడువు పొడిగింపు అందరికీ వర్తించదని గుర్తుంచుకోవాలి. జీతభత్యాలు పొందే ఉద్యోగులకు కూడా వర్తించదు. పన్ను చెల్లింపుదారులు తమ అర్హతను పరిశీలించి నిర్ణీత గడువులోగా రిటర్నులు దాఖలు చేయాలి.
ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు.. :
ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేవారు నవంబర్ నెలలో బ్యాంకుల వడ్డీ రేట్ల మార్పులను చెక్ చేయాలి. మార్కెట్ పరిస్థితులు, నగదు లభ్యత, రుణాల అవసరాలను బట్టి బ్యాంకులు ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. ఈ మార్పులు కొత్తగా డిపాజిట్లు చేసే వారితో పాటు, పాత డిపాజిట్లను రెన్యువల్ చేసుకునే వారిపైనా ప్రభావం చూపుతాయి.
అయితే, నవంబర్ 1 నుంచి అన్ని బ్యాంకులకు ఒకే విధమైన వడ్డీ రేటు మార్పు ఉండదు. ప్రతి బ్యాంకు తన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. అందుకే పెట్టుబడి పెట్టే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితులను కంపేర్ చేయాలి.. అలాగే అడ్వాన్స్ విత్ డ్రా నిబంధనలను పరిశీలించిన తర్వాతే ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడం బెటర్..



