- జియో అతి చౌకైన రూ. 55 రీఛార్జ్ ప్లాన్
- భారత్ వర్సెస్ న్యూజిలాండ్ లైవ్ మ్యాచ్
- వెయ్యికిపైగా టీవీ ఛానళ్లు కూడా చూసేయొచ్చు
Jio Rs 55 Recharge Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో అందించే ఈ సరసమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే చాలు.. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూసేయొచ్చు.. ఇందుకోసం అత్యంత ఖరీదైన రీఛార్జ్‌లు అక్కర్లేదు.. ప్రత్యేక సబ్స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన పనిలేదు.. రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం రూ. 55 స్పెషల్ రీఛార్జ్ ప్యాక్‌ను తీసుకువచ్చింది. దీన్ని ‘వాచ్ లైవ్ IND vs NZ’ ఆఫర్‌తో ప్రత్యేకంగా అందిస్తోంది..
ఈ ప్యాక్ ధర కేవలం రూ. 55 మాత్రమే. 3GB హై-స్పీడ్ డేటాతో పాటు 30 రోజుల లైవ్ టీవీ ఛానెల్‌లను అందిస్తుంది. జియో రూ. 55 రీఛార్జ్‌తో (Jio Cheapest Plan) భారత్ vs న్యూజిలాండ్ లైవ్ మ్యాచ్‌ను చూడవచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జియో రూ. 55 రీఛార్జ్ ప్లాన్ :
జియో రూ. 55 రీఛార్జ్‌లో ‘వాచ్ లైవ్ IND vs NZ’ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా ఇండియా vs న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ ఆన్లైన్లో చూడొచ్చు.. మ్యాచ్ సమయంలో మొబైల్లో లైవ్ క్రికెట్ చూసే అవకాశం ఉంటుంది. మ్యాచ్ లైవ్ ద్వారా ఏ ఛానెల్ లేదా ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటుందో జియోటీవీ (JioTV) యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.. రీఛార్జ్ చేసేటప్పుడు మైజియో (MyJio) యాప్‌లో తప్పకుండా చెక్ చేసుకోండి..
Read Also :
3జీబీ హై-స్పీడ్ డేటా :
ఈ రీఛార్జ్‌లో మొత్తం 3GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. దీనికి 3 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ డేటాను 3 రోజుల్లోపు వాడుకోవచ్చు.. డేటా లిమిట్ దాటాక స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది. ఈ వేగంతో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేయడం కష్టంగా మారొచ్చు..
1000కు పైగా స్పెషల్ టీవీ ఛానెళ్లు :
జియో రూ. 55తో క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు.. 30 రోజుల పాటు 1000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లు చూడొచ్చు.. ఈ ఛానెళ్లను జియోటీవీ మొబైల్ యాప్ ద్వారా చూడవచ్చు. ఇందులో సోనీ స్పోర్ట్స్, సోనీ టెన్, సెట్ హెచ్డి వంటి సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఛానెళ్లు ఉన్నాయి.
జియోస్టార్ నెట్‌వర్క్‌లో స్టార్ ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ వంటి ఛానెళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్యాక్‌లో సన్ టీవీ హెచ్డి, కేటీవీ హెచ్డి, డిస్కవరీ ఛానల్, యానిమల్ ప్లానెట్, ఈటీవీ హెచ్డీ వంటి ఛానెళ్లు ఉన్నాయి.
వ్యాలిడిటీ :
ఈ రీఛార్జ్‌లో డేటా, టీవీ యాక్సెస్ వ్యాలిడిటీ వేర్వేరుగా ఉంటుంది. 3GB హై-స్పీడ్ డేటా వ్యాలిడిటీ 3 రోజులు ఉంటే.. లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్ 30 రోజులు ఉంటుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ డేటా ముందుగానే అయిపోతే మిగిలిన రోజంతా టీవీ చూసేందుకు మీకు స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే..



