Telangana Rains : అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు..

Must read

Telangana Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుపాను ఏపీవైపు దూసుకొస్తోంది. ఇది అతి తీవ్ర తుపానుగా ప్రభావం చూపనుంది. ఇది మంగళవారం ఉదయం 11.30 నుంచి బుధవారం 11.30గంటల వరకు కొనసాగుతుందని, బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో తుపాను బలహీనపడి 29వ తేదీనాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని, 30వ తేదీన అల్పపీడనంగా బలహీన పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా, ఇవాళ, రేపు ఏపీతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : Arnab Cyclone : అతి తీవ్ర తుపాన్‌గా ఆర్నబ్.. ఏపీలోని కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు, రేపు కుంభవృష్టి.. భీకర గాలులు..

ఆర్నబ్ తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవాకశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

బుధవారం ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా గురువారం అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎప్పడికప్పుడు వాతావరణ శాఖ సూచనలు పాటించాలని సూచించారు. వర్షాలతోపాటు భారీ స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగులు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!