CM Revanth Reddy: రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. దసరా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న సీఎం

Must read

CM Revanth Reddy: విజయదశమి పండుగను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. 2026 అక్టోబర్ 22 (గురువారం) నాడు జరిగే దసరా ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో నేరుగా మమేకమై శుభాకాంక్షలు తెలుపుకునేందుకు ఈ పర్యటనను ఖరారు చేశారు. సీఎం రాక సందర్భంగా నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొనగా, కనీవిని ఎరుగని రీతిలో ఆహ్వానం పలికేందుకు స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

Sheikh Anisha: ఆళ్లగడ్డ మున్సిపాలిటీపై పసుపు జెండా.. చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ఏకగ్రీవం

నిమిషాల వారీగా పర్యటన షెడ్యూల్.. పటిష్ట బందోబస్తు నడుమ విస్తృత ఏర్పాట్లు:

ముఖ్యమంత్రి (CM Revanth Reddy)పర్యటన వివరాలను పరిశీలిస్తే.. గురువారం ఉదయం 11:50 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి కొడంగల్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమావేశమై దసరా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4:00 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం, పోలీసులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!