India Women vs Zimbabwe Women 3rd T20 : ఇండియా మహిళల జట్లు వర్సెస్ జింబాబ్వే మహిళల జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు జింబాబ్వేకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Also Read: Asian Para Games 2026 : ఆసియా పారా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నిషాద్ కుమార్.. రెండో స్వర్ణం కైవసం..
భారత మహిళల జట్టు నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 41బంతుల్లో 91 పరుగులు (నాటౌట్) చేయగా.. షెఫాలీ వర్మ సుడిగాలి ఇన్నింగ్స్‌తో 37బంతుల్లో 69 పరుగులు చేసింది. అనుష్క శర్మ 28 పరుగులతో పర్వాలేదనిపించగా.. రిచా ఘోష్ 1, నిక్కీ ప్రసాద్ 9, అరుంధతీరెడ్డి నాలుగు, ప్రేమ రావత్ 4 రన్స్ చేశారు. దీప్తి శర్మ డకౌట్ అయ్యి విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బిజా మూడు వికెట్లు, నోమ్‌వెలో సిబంద, న్యాషా, టెండాయ్ మకుషా తలో వికెట్ తీశారు.
Incredible hit
Applause and appreciation all aroundScorecard
https://t.co/JQfrsq5B2K
#TeamIndia | #INDvZIM | @mflone_ | @ImHarmanpreet https://t.co/NoiaemtX0j
— BCCI Women (@BCCIWomen) October 20, 2026



https://t.co/JQfrsq5B2K
