AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Must read

AP Rains : ఏపీలో గత నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాలపై వాతావరణ శాఖ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చింది. వచ్చే వారం రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Also Read : Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్..? టీవీకే నేత కీలక కామెంట్స్..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆ తరువాత ఇది వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలో వచ్చే వారం రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో బుధవారం పోలవరం, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వర్షాలతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వర్షాకాలంలో వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవటంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల్లో వర్షాలు కురిస్తే పంటలకు మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!