MS Dhoni : నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బాసూ .. పాపం ఫీలైన‌ట్టుంది.. భార్య సాక్షితో ధోని వీడియో వైర‌ల్‌..

Must read

MS Dhoni : టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌ ఎంఎస్ ధోని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న ఆట‌, కెప్టెన్సీతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఈ దిగ్గ‌జ ఆట‌గాడు ప్ర‌స్తుతం ఐపీఎల్ మాత్ర‌మే ఆడుతున్నాడు. తాజాగా అత‌డు త‌న భార్య‌ను ప‌బ్లిక్‌లో ఆట ప‌ట్టించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం నవరాత్రి వేడుకల‌ను నిర్వ‌హించింది. ఈ వేడుక‌ల్లో ధోని త‌న కుటుంబంతో క‌లిసి పాల్గొన్నాడు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లతో కలిసి ధోని త‌న భార్య సాక్షితో క‌లిసి డ్రాగన్ బోట్ రైడ్ సహా పలు యాక్టివిటీస్‌లో పాల్గొన్నాడు. ప‌లు ఆట‌లు ఆడుతూ ఫ్యాన్స్‌తోనూ ముచ్చటించాడు.

భార్య‌ను ఆట‌ప‌ట్టించిన ధోని..

ప‌బ్లిక్‌గా త‌న భార్య సాక్షిని ధోని ఆట‌ప‌ట్టించాడు. ఐస్‌క్రీమును తిన‌మ‌ని చెబుతూ స్ఫూన్‌ను ఆమె నోటి ద‌గ్గ‌రికి తీసుకువ‌చ్చాడు. ఈ క్ర‌మంలో సాక్షి తినేందుకు ప్ర‌య‌త్నించ‌గా వెంటేనే త‌న చేతిని వెన‌క్కి లాగి ఐస్‌క్రీస్ ను తానే తీశాడు ధోని. ఇలా ఒక సారి సార్లు రెండు మూడు సార్లు జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

IND vs NZ : గురువారం నుంచే భార‌త్‌ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్‌.. జియో హాట్‌స్టార్‌లో రాదు.. మ‌రీ ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

దీంతో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బాసూ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!