Elon Musk SpaceX Share : అమెరికా పిల్లలకు ఎలన్ మస్క్ బంపర్ ఆఫర్.. ఒక్కొక్కరికీ స్పేస్‌ఎక్స్ షేరు.. వాల్యూ ఎంతంటే?

Must read

  • పిల్లలందరికీ స్పేస్‌ఎక్స్ వాటా.. మస్క్ సంచలన ప్రకటన
  • చిన్నారులకు మస్క్ బంపర్ ఆఫర్.. షేరు విలువ రూ.12 వేలకుపైనే
  • ఆంథ్రోపిక్ ప్రకటనకు మస్క్ కౌంటర్.. ప్రజలకే కంపెనీ షేర్లు

Elon Musk SpaceX Share : అమెరికాలోని పిల్లలందరికీ స్పేస్‌ఎక్స్ షేరు ఇవ్వనున్నారా? ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది అమెరికాలో ప్రతి చిన్నారికి తన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌లో ఒక్కో షేరు ఇవ్వనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. అయితే, ఈ ప్రతిపాదన అమలుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు..

ఆంథ్రోపిక్ ప్రకటనతో మొదలైన చర్చ :
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంథ్రోపిక్ తన కంపెనీలోని 5 శాతం వాటాను ప్రజాప్రయోజనాల కోసం ఏర్పాటు చేయనున్న నిధికి కేటాయించనున్నట్లు ప్రకటించింది. ‘ఆంథ్రోపిక్ పబ్లిక్ బెనిఫిట్ ఫండ్’ ద్వారా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించడమే కాకుండా అవసరమైన వర్గాలకు ఆర్థిక సాయం చేయాలని సంస్థ భావిస్తోంది. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగ రంగంలో చోటుచేసుకునే మార్పులు, కార్మికులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారంపైనా ఈ ఫండ్ ఫోకస్ పెట్టనుంది.

Read Also : Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇలా కొంటే ఏకంగా రూ.15,901 ఆదా!

నిధి వద్దు.. నేరుగా ప్రజలకే :
ఆంథ్రోపిక్ ప్రకటనపై స్పందించిన ఎలన్ మస్క్.. కంపెనీ వాటాలను ప్రత్యేక నిధికి కేటాయించడం కన్నా నేరుగా ప్రజలకే అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తాను కూడా భవిష్యత్తులో ఇదే తరహాలో చేయనున్నట్లు ప్రకటించారు. ముందుగా ఏ కంపెనీ షేర్లను పంపిణీ చేస్తారనే విషయాన్ని మస్క్ రివీల్ చేయలేదు. ఆ తర్వాత స్పేస్‌ఎక్స్ పేరును ప్రస్తావిస్తూ అమెరికాలోని ప్రతి పిల్లాడికీ ఒక్కో షేరు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఒక్కో షేరు వాల్యూ ఎంతంటే? :
స్పేస్‌ఎక్స్ షేరు ధర 146.03 డాలర్లుగా ఉందని అంచనా. ఈ లెక్కన ఒక్కో షేరు వాల్యూ భారత కరెన్సీలో సుమారు రూ.12 వేలకుపైగా ఉంటుంది. అయితే, ఈ విలువను ప్రస్తుత మార్కెట్ ధరగా స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది. అలాగే అర్హత వయసు, పంపిణీ విధానం, షేర్ల బదిలీకి సంబంధించిన నిబంధనలపై క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!