YS Jagan : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. మనం రాజ్యాంగబద్ధ పాలనలో ఉన్నామా? లేదా..? రాష్ట్రంలో చట్టం, న్యాయం ఉందా? అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Dasara Festival 2026 : దసరా రోజున ఈ మూడు ప్రత్యేక పరిహాలు చేయండి.. మీకు అదృష్టం పట్టినట్లే..!
రిజర్వేషన్లు ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. వైసీపీ నామినేషన్లను కూటమి నేతలు అడ్డుకుంటున్నారు. అధికారులు వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు. అంతటితో ఆగకుండా వైసీపీ అభ్యర్థులను అరెస్టు చేస్తున్నారు. అసలు వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ జగన్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల తీరును చూస్తుంటే రాజ్యాంగబద్ధ పాలనలో ఉన్నామా అనే సందేహాలు కలుగుతున్నాయి. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. కేసులు పెడతామని వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీ నిద్రపోతుంటే రాష్ట్రంలో ప్రజాబద్ధ పాలన ఉన్నట్లా అంటూ జగన్ ప్రశ్నించారు.


