Spirit : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ – సందీప్ వంగ లాంటి కాంబో కావడం, మొదటి సారి ప్రభాస్ పోలీస్ గా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. 2025 నవంబర్ లో ఈ సినిమా ఓపెనింగ్ జరగ్గా కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
మొదట 2027 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు ప్రకటించి స్పిరిట్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ప్రభాస్ ఫోటో ఉన్న కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ స్పిరిట్ సినిమా 2027 అక్టోబర్ 29 దీపావళి కానుకగా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ క్యాప్ పెట్టుకొని గడ్డం తో సీరియస్ లుక్ లో కనిపించాడు. ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ సినిమా కోసం ఇంకా సంవత్సరం వెయిట్ చేయాలా అని నిరాశలో చెందుతున్నారు.
Also See : Supritha : తల్లి సురేఖవాణితో కలిసి విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన సుప్రీత.. ఫొటోలు..
Check this out……..
#Spirit
#InSpiritMode
@TSeries
@VangaPictures
#IndiasBiggestSuperStar
29TH OCTOBER DIWALI 2027
Worldwide RELEASE DATEhttps://t.co/SmPjKHzuVE
— Sandeep Reddy Vanga (@imvangasandeep) October 18, 2026



https://t.co/SmPjKHzuVE
