Ukraine Drone Attack : రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ సునామీ.. 1,015 డ్రోన్లతో విరుచుకుపడిన కీవ్‌.. మంటల్లో ఆయిల్ టెర్మినల్‌!

Must read

  • రష్యాపై డ్రోన్ సునామీ.. 1,015 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి
  • మంటల్లో ఆయిల్ టెర్మినల్‌.. రష్యాపై ఉక్రెయిన్ మెగా అటాక్
  • రష్యాపై డ్రోన్ల దండయాత్ర.. ఇంధన కేంద్రాలే టార్గెట్

Ukraine Drone Attack : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భీకర మలుపు తిరిగింది. రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు దిగినట్లు వచ్చిన వార్తలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

ఏకకాలంలో వెయ్యికిపైగా డ్రోన్లను ప్రయోగించినట్లు సమాచారం.. ఈ దాడుల్లో రష్యాలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలు లక్ష్యంగా మారగా.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఆయిల్ టెర్మినల్‌లో మంటలు చెలరేగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

మంటల్లో ఇంధన కేంద్రాలు :
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆయిల్ టెర్మినల్‌తోపాటు రూచి ఆయిల్ డిపోలోనూ అగ్నిప్రమాదాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఓజోన్ లాజిస్టిక్స్ కేంద్రం, వీకే డేటా సెంటర్‌పైనా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.

Read Also : DA Hike 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపుతో అక్టోబర్ జీతం ఎంత పెరుగుతుందంటే!

ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడినట్లు సమాచారం.. మరోవైపు, మొత్తం 1,015 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే, ఈ సంఖ్యకు సంబంధించిన స్వతంత్ర ధ్రువీకరణ వివరాలు అందుబాటులో లేవు.

ఇంధన మౌలిక సదుపాయాలే టార్గెట్ :
రష్యా చమురు, ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ దాడులను విమర్శిస్తున్న సమయంలోనే తాజా దాడులు చోటుచేసుకున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

రష్యా దాడులపై జెలెన్‌స్కీ ఫైర్ :
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లోని జపోరిజియాపై రష్యా జరిపిన దాడుల్లో ఒక మహిళ మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.. ట్రంప్ ప్రకటించిన ‘ఇంధన కాల్పుల విరమణ’ తర్వాతి వారం రోజుల్లోనే ఉక్రెయిన్‌లోని ఇంధన, చమురు, గ్యాస్ సదుపాయాలపై రష్యా 76 సార్లు దాడులు చేసిందని అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు.

విద్యుత్ బ్లాక్‌అవుట్ సృష్టించేందుకు మాస్కో ప్రయత్నిస్తోందని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ఆంక్షల సడలింపులు, ఒప్పందాలకు అనుగుణంగా రష్యా సానుకూల చర్యలు తీసుకోవడం లేదని అమెరికా గుర్తించాలని కోరారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!