Telangana Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెండ్రోజులు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. అలర్ట్ జారీ..

Must read

Telangana Rain Alert : తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వర్షాలులేక రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Also Read : Palapitta Bird : ప్రమాదంలో పాలపిట్టల మనుగడ.. ఈసారి పండుగకు దర్శనం కరువేనా? అసలెందుకిలా జరుగుతుంది..

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు దంచికొడతాయని తెలిపింది. మంగళవారం, బుధవారం కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిశాయి. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అయితే, ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఈ వారం చివరి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!