Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ

Must read

Shubman Gill : భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు రంజీ ట్రోఫీలో నిరాశ ఎదురైంది. న్యూజిలాండ్‌ పర్యటనకు ముందు ఎర్ర బంతి క్రికెట్‌లో ప్రాక్టీస్‌ కోసం పంజాబ్‌ తరఫున బరిలోకి దిగిన గిల్‌.. తన ఇన్నింగ్స్‌ను ఎక్కువసేపు కొనసాగించలేకపోయాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం ఐదు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో గిల్‌ ఔటైన తీరు క్రికెట్‌ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీ?

పంజాబ్‌ తరఫున బ్యాటింగ్‌కు దిగిన గిల్‌.. ఛత్తీస్‌గఢ్‌ బౌలర్‌ అజయ్‌ మండల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. క్రీజులో ఎక్కువ సమయం నిలవకుండానే వెనుదిరగడంతో పంజాబ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న గిల్‌ నుంచి పెద్ద ఇన్నింగ్స్‌ ఆశించిన అభిమానులకు ఈ ప్రదర్శన నిరాశ కలిగించింది.

శుభ్‌మన్ గిల్‌ వికెట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. న్యూజిలాండ్‌తో జరగనున్న అంతర్జాతీయ సిరీస్‌కు ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం గిల్‌ రంజీ ట్రోఫీలో ఆడటానికి ప్రధాన ఉద్దేశంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే, ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటవడంతో అతడికి ఎక్కువసేపు క్రీజులో నిలిచే అవకాశం లభించలేదు. రాబోయే మ్యాచ్‌ల్లో గిల్‌ ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!