Namo Narayana : ఇటీవల రిలీజయిన రజినీకాంత్ జైలర్ 2 సినిమా థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ ని మించి మూర్తి అనే పాత్ర వైరల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మూర్తి తన భుజాలపై సినిమాని నడిపించాడు అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మూర్తి ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ వరకు మూర్తి ఉన్న ప్రతి సీన్ ఫుల్ గా నవ్వుకుంటాము.
తన డైలాగ్స్, వాకింగ్ స్టైల్, చెస్ ఆడే తీరు, అతను తిట్టే విధానం, తన హావభావాలు.. ఇలా మూర్తి అన్ని రకాలుగా జైలర్ 2 సినిమాలో కామెడీ విలన్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫుల్ గా నవ్వించాడు ప్రేక్షకులను. దీంతో సోషల్ మీడియా అంతా మూర్తి వైరల్ అవుతున్నాడు. రజినీకాంత్ నే డామినేట్ చేసాడు అంటూ మీమ్స్ వస్తున్నాయి. అతని కాన్ఫిడెన్స్ మనకు కూడా ఉండాలి అంటూ మీమ్స్ వేస్తున్నారు. దీంతో ఇంత వైరల్ అవుతున్న ఈ మూర్తి అసలు పేరు ఏంటి? ఎవరు ఇతను అని చర్చ మొదలయింది.
Also Read : Kajal Aggarwal : చెల్లి పుట్టిన రోజు.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్..
మూర్తి అసలు పేరు నమో నారాయణ. తమిళ్ స్టార్ నటుడు, దర్శకుడు సముద్రఖని ఇతని ఫ్రెండ్. నమో నారాయణ TCS లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేటప్పుడు సముద్రఖని తాను తీసిన నాడోడిగళ్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అలా 2009 లో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు నమో నారాయణ. ఆ సినిమాతో కాస్త గుర్తింపు వచ్చి సినిమా అవకాశాలు రావడంతో జాబ్ మానేసి పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టాడు.
కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నమో నారాయణ తమిళ్ లో దాదాపు 50 సినిమాలకు పైగా నటించాడు. కరుప్పు, అరన్మలై, రాయన్, పాతు తల, లైసెన్స్, విశ్వాసం, పిస్తా.. ఇలా అనేక హిట్ సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు జైలర్ 2 లో కామెడీ విలన్ గా ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా నవ్వించి పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత నమో నారాయణ కు అన్ని భాషల నుంచి ఆఫర్స్ వెల్లువెత్తడం ఖాయం.
Also Read : Apeksha Porwal : జైలర్ 2 క్లైమాక్స్లో యాక్షన్ తో అదరగొట్టిన ఈ నటి ఎవరో తెలుసా? ఆపేక్ష పూర్వాల్ ఫొటోలు..


