Hyderabad : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నగరంలో అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు.. ఈ ఫోర్ డేస్ మాత్రమే.. రూట్లు, టైమింగ్స్ ఇలా..

Must read

Hyderabad : హైదరాబాద్ నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలను దర్శించుకోవాలనుకునే వారికి శుభవార్త. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.’టెంపుల్స్ దర్శన్ టూర్’ పేరుతో భక్తుల సౌకర్యార్థం గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

Also Read : Dasara Festival 2026 : దసరా రోజున విజయ ముహూర్తం ఎప్పుడు..? ఆ సమయంలో ఇలాచేస్తే అద్భుత ఫలితాలు

జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి, సికింద్రా‌బాద్ మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల దర్శనార్థం ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

ఈనెల 17, 18, 19, 20 తేదీల్లో నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ సౌకర్యాన్ని సద్విని యోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ఈ ప్రత్యేక బస్సులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గంటకు ఒకటి చొప్పున నడుస్తాయి.

సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బల్కంపేట, పెద్దమ్మగుడి, చార్మినార్, మహంకాళి దేవాలయం వరకు ఒక రూట్.. అఫ్టల్ంజ్ నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, పెద్దమ్మగుడి, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, మహంకాళి దేవాలయం వరకు రెండో రూట్‌గా ఎంపిక చేసి బస్సులు నడుపుతున్నారు.

బస్సుల వేళలు..
♦ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బల్కంపేట : ఉదయం 7.0, 8.0, 9.0, 10.15, 11.15, మధ్యాహ్నం 12.15, 1.40, 2.40, 3.40 గంటలకు
♦ అఫ్ఘల్గంజ్ నుంచి చార్మినార్ : ఉదయం 7.30, 8.30, 9.30, 11.00, మధ్యాహ్నం 12.00, 1, 2.30, 3.30, సాయంత్రం 4.30గంటలకు
♦ బల్కంపేట నుంచి పెద్దమ్మగుడి : ఉదయం 7.30, 8.30, 9.30, 10.45, 11.45, మధ్యాహ్నం 12.45, 2.10, 3.10, సాయంత్రం 4.10 గంటలకు.
♦ చార్మినార్ నుంచి పెద్దమ్మగుడి : ఉదయం 7.45, 8.45, 9.45, 11.15, 12.15, 115, మధ్యాహ్నం 2.45, 3.45, సాయంత్రం 4.45 గంటలకు
♦ పెద్దమ్మగుడి నుంచి చార్మినార్ : ఉదయం 8.15, 9.15, 10.15, 11.20, మధ్యాహ్నం 12.20, 1.20, 2.55, 3.55, సాయంత్రం 4.55 గంటలకు
♦ పెద్దమ్మగుడి నుంచి బల్కంపేట : ఉదయం 8.40, 9.40, 10.40, మధ్యాహ్నం 12.10, 1.10, 2.10, 3.50, సాయంత్రం 4.50, 5.50 గంటలకు.
♦ చార్మినార్ నుంచి మహంకాళి దేవాలయం : ఉదయం 9.10, 10.10, 11.10, మధ్యాహ్నం 12.25, 1.25, 2.25. సాయంత్రం 4.00. 5.00, 6 గంటలకు
♦ బల్కంపేట నుంచి మహంకాళిదేవాలయం : ఉదయం 9.25, 10.25, 11.25, మధ్యాహ్నం 12.55, 1.55, 2.55, సాయంత్రం 4.25. 5.25, 6.25గంటలకు

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!