Janaki Ram : ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టిన మరో దర్శకుడు.. జానకిరామ్ మారెళ్ల

Must read

Janaki Ram : ఇటీవల కొంతమంది దర్శకులు మొదటి సినిమాతోనే మంచి విజయాలు అందుకుంటున్నారు. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు మరో దర్శకుడు చేరాడు. కామ్రేడ్ కళ్యాణ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు జానకిరామ్ మారెళ్ల. శ్రీవిష్ణు హీరోగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమాగా తెరకెక్కిన కామ్రేడ్ కళ్యాణ్ ఇటీవల థియేటర్స్ లోకి వచ్చి మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

అనేక సినిమాలకి రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన జానకిరామ్ మారెళ్ల అతని బలం కామెడీ టైమింగ్ అంటున్నారు. సింపుల్ వన్‌లైనర్స్, సహజమైన సంభాషణలు, సందర్భానుసారంగా వచ్చే కామెడీతో థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించారు ఈ దర్శకుడు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా బాగా తెరకెక్కించారు జానకిరామ్ మారెళ్ల.

Also Read : Vijay Rashmika : బతుకమ్మ ఆడటానికి వస్తున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న.. ఎప్పుడు? ఎక్కడ?

తన గురువు దర్శకుడు బాబీ తరహాలోనే యాక్షన్ సన్నివేశాలను రిచ్‌గా, ఆకట్టుకునే విజువల్స్‌తో రూపొందించాడు. మొదటి సినిమాలోనే కామెడీ, యాక్షన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించాడు జానకిరామ్ మారెళ్ల. కామ్రేడ్ కళ్యాణ్ హిట్ తో దర్శకుడిగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న జానకిరామ్ మారెళ్ల. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా కథతో పలువురు హీరోలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. త్వరలోనే తన కొత్త సినిమా ప్రకటించనున్నారు ఈ దర్శకుడు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!