Hyderabad Water Board : నీటి వృథాపై జలమండలి ఫైర్.. పబ్‌కు రూ.20 వేల ఫైన్, వాటర్ కనెక్షన్ కట్!

Must read

  • నీటి వృథాపై జలమండలి ఫైర్..
  • తాగునీటిని వృథా చేశారని ఫిర్యాదు..
  • పబ్‌కు రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్

Hyderabad Water Board : హైదరాబాద్‌లో తాగునీటి వృథాపై జలమండలి అధికారులు కొరడా ఝళిపించారు. నీటిని దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌పై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు తాగునీటి కనెక్షన్‌ను తొలగించారు. అంతేకాదు.. కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను సైతం నిలిపివేశారు. నీటి వృథాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ చర్యల ద్వారా జలమండలి స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

ఫిర్యాదాతో రంగంలోకి అధికారులు :
జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని రోడ్ నంబర్ 45, ప్లాట్ నంబర్ 872లో ఉన్న ఫోర్ ఫాదర్స్ పబ్‌లో నీటి దుర్వినియోగం జరుగుతోందంటూ జలమండలికి ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు.

నీటి దుర్వినియోగం జరిగినట్లు గుర్తించిన అనంతరం పబ్ యాజమాన్యంపై జరిమానా విధించింది. వాటర్ కనెక్షన్‌ను కట్ చేశారు. జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కమర్షియల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని కూడా నిలిపివేశారు.

Read Also : Tirumala Devotees Alert : శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్.. పండుగ స్పెషల్ రైళ్లలో బెర్తులు ఖాళీ.. వెంటనే బుక్ చేసుకోండి!

ప్రతి నీటి చుక్కా విలువైనదే :
వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో నీటి వినియోగంపై జలమండలి అప్రమత్తమైంది. నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశముండటంతో ప్రజలు ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించాలని సూచించింది.

ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించడంతో పాటు నీటి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించింది.

నీటి వృథా కనిపిస్తే ఇలా ఫిర్యాదు చేయండి :
మీ పరిసరాల్లో ఎక్కడైనా తాగునీరు వృథా అవుతున్నా, దుర్వినియోగం జరుగుతున్నా జలమండలికి ఫిర్యాదు చేయవచ్చు.

వాట్సాప్ నంబర్ : 99499 30003
కస్టమర్ కేర్ : 155313

ఫిర్యాదుతో పాటు ఫొటోలు, వీడియోలు, ఘటన జరిగిన ప్రాంతం, పూర్తి చిరునామా, సంబంధిత వ్యక్తులు లేదా సంస్థల వివరాలను అందించవచ్చు. ఫిర్యాదులపై విచారణ జరిపి ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని జలమండలి తెలిపింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!