Dasara Festival 2026 : దసరా రోజున విజయ ముహూర్తం ఎప్పుడు..? ఆ సమయంలో ఇలాచేస్తే అద్భుత ఫలితాలు

Must read

Dasara Festival 2026 : సనాతన ధర్మంలో అనేక పండుగలు చెడుపైన మంచి సాధించిన విజయాలకు ప్రతీకగానే జరుగుతుంటాయి. అలాంటి పర్వదినాల్లో విజయదశమి ప్రముఖమైంది. ఈసారి దసరా పండుగ అక్టోబర్ 20వ తేదీన జరుపుకోనున్నారు.

Also Read : Garividi Lakshmi : రియల్ ‘గరివిడి లక్ష్మి’ని చూశారా..? గరివిడి లక్ష్మి సక్సెస్ మీట్‌లో సందడి..

దసరా వేడుకల్లో చిట్టచివరి రోజైన విజయదశమి వేళ శ్రీరాజరాజేశ్వరిగా అపరాధితగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అన్నీతానై అంతాతానై ఉన్న శక్తి స్వరూపిణి విశ్వరూప స్వరూపమే శ్రీమహారాజ్ఞి రాజరాజేశ్వరి. ఇంతకీ దసరా రోజున విజయ ముహూర్తం ఎప్పుడొస్తుంది.? ఎంతసేపు ఉంటుంది..? ఆ సమయంలో ఏం చేయాలో చూద్దాం.

విజయ దశమి రోజంతా మంచిదే అయినప్పటికీ.. ఇందులో విజయ ముహూర్తం ఎంతో ప్రత్యేకమైనదని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. విజయ దశమి రోజున రవికి ఎనిమిది, ఏడు స్థానాల్లో సూర్యోదయ లగ్నానికి ఐదు, ఆరు లగ్నాల్లో ఉన్నటువంటి సమయాన్ని విజయ ముహూర్తం అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ముహూర్తం అంటే 48 నిమిషాలు. వర్జ్య దుర్ముహూర్తాల్లేకుండా రవి బలంగా ఉన్నటువంటి సమయం విజయదశమి రోజు వస్తే దాన్ని విజయ ముహూర్తంగా పేర్కొంటారు. ఈ సమయంలో ఆరంభించే కార్యక్రమాల్లో తప్పకుండా విజయం వరిస్తుందని విశ్వాసం.

దసరా పండుగ రోజున విజయ ముహూర్తం మధ్యాహ్నం 1.57 గంటల నుంచి మధ్యాహ్నం 2.43 గంటల వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా, ఏ పూజ చేసినా అఖండ విజయం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి సిద్ధమవడానికి ముందు, అలాగే పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని ఆయుధాలు ధరించడానికి ముందు ఈ పూజలనే చేసేవారు.

అయితే, విజయదశమి రోజున విజయ ముహూర్తం ప్రాంతాల వారిగా మారుతుంటుంది. హైదరాబాద్ ప్రాంతంలో విజయ ముహూర్తం 20వ తేదీన మధ్యాహ్నం 1.57గంటల నుంచి మధ్యాహ్నం 2.44 గంటల వరకు ఉంటుంది. ఒంగోలు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలవైపు హైదరాబాద్ కన్నా 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ మాత్రమే తేడా. అంటే సుమారు 1.50 గంటల నుంచి 2.40 గంటల మధ్య ఉంటుంది.

విజయ దశమి ముహూర్తం సమయంలో పూజ చేయడం కుదరకపోతే అపరాహ్ణ కాలంలో (మధ్యాహ్నం 1.10 నుంచి 3.30 గంటలు) ఎప్పుడైనా చేయవచ్చు. అదీ కుదరకపోతే.. సాయంత్రం దశమి ఉండగానే చేయొచ్చు. కానీ, అది మూడో ఎంపిక అవుతుందని పండితులు చెబుతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!