Amazon Sale 2026 : రూ.60 వేలలోపు అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ డీల్స్.. వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లపై భారీ తగ్గింపులు!

Must read

  • రూ.60 వేలలోపే పవర్‌ఫుల్ ఫోన్లు..
  • వన్‌ప్లస్, ఒప్పోపై అదిరిపోయే ఆఫర్లు
  • రూ.18 వేల వరకు తగ్గింపా?
  • భారీ బ్యాటరీ.. సూపర్ కెమెరా ఫీచర్లు

Amazon Sale 2026 : పండుగ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 అదిరిపోయే డీల్స్‌ను తీసుకొచ్చింది. పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలు, ఆకట్టుకునే కెమెరాలతో పలు స్మార్ట్‌ఫోన్‌లు రూ.60వేల లోపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్, ఒప్పో, రెడ్‌మి ఫోన్ల ధరల ఎంత అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఒప్పో రెనో 16c 5జీ :
ఒప్పో రెనో 16c 5జీ (8GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.79,999 నుంచి రూ.57,999కి తగ్గింది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP కెమెరా స్పెషల్ అట్రాక్షన్.. 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో లాంగ్ టైమ్ ఫోన్ వాడాలని అనుకునేవారికి అద్భుతమైన ఆప్షన్.

Read Also : Airtel Recharge Plans : డేటా వాడని వారికి పండగే.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. ఎయిర్‌టెల్‌ నుంచి 3 సరికొత్త ప్లాన్లు..!

రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ 5జీ :
రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ 5జీ ఫోన్ (12GB + 256GB) ధర రూ.74,999 నుంచి రూ.55,990కి తగ్గింది. 6.83 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి.

వన్‌ప్లస్ 15ఆర్ ఏస్ ఎడిషన్ :
వన్‌ప్లస్ 15ఆర్ ఏస్ ఎడిషన్ (12GB + 256GB) ధర రూ.61,999 నుంచి రూ.56,999కి తగ్గింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16, 7,400mAh బ్యాటరీతో పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

వన్‌ప్లస్ 15ఆర్ :
వన్‌ప్లస్ 15ఆర్ కూడా రూ.61వేల నుంచి రూ.56,999కి తగ్గింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 165Hz 1.5K డిస్‌ప్లే, 7,400mAh బ్యాటరీ వంటివి ఆకర్షణీయంగా ఉంటాయి. మొత్తంగా, రూ.60 వేల బడ్జెట్‌లో ఫోన్ కొనేవారికి ఈ డీల్స్ అద్భుతంగా ఉంటాయి. అయితే, కొనుగోలు చేసే ముందు అమెజాన్‌లో ప్రస్తుత ధర, బ్యాంక్ ఆఫర్లు, లభ్యత, ఫోన్ స్పెసిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!