321 Movie : మోహిత్ పెద్దాడ, లావణ్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘3 2 1’. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ అనేది ట్యాగ్ లైన్. బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వంగపాటి రామానుజ రెడ్డి, చిలుముల శాంతికుమార్ నిర్మాణంలో చిలుముల శాంతికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే అబ్బాయి, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే అమ్మాయి మధ్య ఈ కథ సాగనుంది.
తాజాగా ఈ ‘3 2 1’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మూవీ యూనిట్. ఈ సినిమా అక్టోబరు 23న థియేటర్స్ ముందుకు రానుంది. వివన్ సూర్య, ప్రభావతి, మాధవి, లక్ష్మీ వెన్నెల, యామిని, కుంతి శ్రీనివాస్, అప్పాజీ అంబరీష, విద్యాసాగర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి.
Also Read : Apeksha Porwal : జైలర్ 2 క్లైమాక్స్లో యాక్షన్ తో అదరగొట్టిన ఈ నటి ఎవరో తెలుసా? ఆపేక్ష పూర్వాల్ ఫొటోలు..
మీరు కూడా ఈ ‘3 2 1’ సినిమా ట్రైలర్ చూసేయండి..


