Vande Bharat Sleeper Train: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్.. పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్.. స్టేషన్స్ హాల్టింగ్ లిస్ట్ ఇదే!

Must read

Vande Bharat Sleeper Train: దేశీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిరీస్‌లో స్లీపర్ వెర్షన్ అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ హౌరా-గువహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును(Vande Bharat Sleeper Train) ప్రారంభించగా, ఇప్పుడు ఏపీ ప్రజలకు కూడా ఈ లగ్జరీ ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది. దసరా పండుగ సందర్భంగా ముంబై, బెంగళూరు నగరాల మధ్య నడిచే ఈ ప్రతిష్టాత్మక రైలు ఏపీ మీదుగా రాకపోకలు సాగించనుండటంతో రాయలసీమ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

TDP First List: స్థానిక సమరానికి టీడీపీ తొలి జాబితా విడుదల.. 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు అభ్యర్థుల ప్రకటన!

ప్రయాణ సమయం ఆదా.. ఏపీలోని ముఖ్యమైన స్టేషన్లలో నిలుపుదల:

బెంగళూరు (SMVT) నుంచి ముంబై (CSMT) మధ్య 1,118 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ రైలు ప్రయాణ సమయాన్ని 20 గంటల నుంచి 16 గంటలకు తగ్గించనుంది. ఏపీలోని ధర్మవరం, అనంతపురం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజ్ కల్పించారు. దీనివల్ల ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు బెంగళూరు, ముంబై నగరాలకు వేగంగా చేరుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రతిపాదిత వేళల ప్రకారం బెంగళూరులో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు ముంబై చేరుకుంటుంది.

ఫ్లైట్ రేంజ్ విలాసాలు.. అత్యాధునిక రక్షణ ఫీచర్లతో సురక్షిత ప్రయాణం:

విమానం తరహాలోనే అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఈ వందే భారత్ స్లీపర్ రైలు సొంతం. ఇందులో సెన్సార్ ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర టాక్ బ్యాక్ సిస్టమ్స్, పవర్ సప్లై కోసం యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్లు, అధునాతన ‘కవచ్’ రక్షణ వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి. ఈ మార్గంలో టికెట్ ధర సుమారు రూ. 3,000 వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తుండగా, పూర్తి వివరాలను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!