US Oil Relief To India: భారత్‌కు ట్రంప్ బిగ్ రిలీఫ్.. రష్యా చమురుపై ఆంక్షలు రద్దు.. సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్!

Must read

US Oil Relief To India: ప్రపంచ ఇంధన మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న ఉత్కంఠభరిత పరిణామాల వేళ భారత్‌కు అమెరికా నుంచి అత్యంత ఊరటనిచ్చే వార్త అందింది. రష్యా నుంచి క్రూడాయిల్, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై విధించాలనుకున్న భారీ టారిఫ్‌ల నుంచి భారత్‌తో సహా మరో ఐదు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US Oil Relief To India) మినహాయింపునిచ్చారు. జాతీయ ప్రయోజనాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

Flight Ticket Prices: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం ప్లాన్.. సుప్రీంకోర్టులో కీలక ప్రకటన!

‘ది లిండ్సే ఓ. గ్రాహం చట్టం – 2026’ నేపథ్యం:

ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా కాంగ్రెస్ ‘ది లిండ్సే ఓ. గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ను తెచ్చింది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే భారత్, చైనాల వంటి దేశాలపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించేలా ఈ చట్టం రూపుదిద్దుకుంది. భారత్ తన ముడిచమురు అవసరాల్లో 88 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుండగా, అందులో రష్యా వాటానే 45 శాతంగా ఉంది. ఒకవేళ ఈ టారిఫ్‌లు అమలైతే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడేది.

పశ్చిమాసియా సంక్షోభం.. ఆచితూచి వ్యవహరిస్తున్న వాషింగ్టన్:

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, హొర్ముజ్ జలసంధిలో రవాణా ఆటంకాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఏర్పడింది. ఈ తరుణంలో రష్యా సరఫరాలపై ఆంక్షలు విధిస్తే మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడుతుందని అమెరికా భావించింది. తమ ఇంధన భద్రతే ప్రాధాన్యమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేయగా, ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ ఆయిల్ ధరలను అదుపులో ఉంచేందుకే ట్రంప్ యంత్రాంగం ఆంక్షల నిలిపివేత వైపే మొగ్గుచూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!