Flight Ticket Prices: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం ప్లాన్.. సుప్రీంకోర్టులో కీలక ప్రకటన!

Must read

Flight Ticket Prices: దేశంలో పండుగలు, సెలవులు, తీవ్ర రద్దీ సమయాల్లో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఛార్జీల యథేచ్ఛ పెంపును అరికట్టేందుకు అవసరమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ‘భారతీయ వాయుయాన్ అధినియమ్-2024’ కింద(Flight Ticket Prices) కొత్త నిబంధనల రూపకల్పన పూర్తయిందని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ పరిణామం విమాన ప్రయాణికులకు రాబోయే రోజుల్లో ఊరట కలిగిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

LK Advani: మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరిక

సుప్రీంకోర్టులో విచారణ.. రెండు వారాల్లో నోటిఫికేషన్:

జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. కొత్త నిబంధనలకు పరిపాలనాపరమైన అనుమతులు లభించాయని, రాబోయే రెండు వారాల్లో అధికారికంగా నోటిఫై చేస్తామని తెలిపారు. దీంతో నోటిఫికేషన్ ప్రతిని తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.

పిఐఎల్ దాఖలు.. ప్రయాణికుల హక్కుల పరిరక్షణ:

ప్రైవేట్ విమానయాన సంస్థలు ఇష్టానుసారంగా ధరలు, అనుబంధ ఛార్జీలు పెంచకుండా పారదర్శక మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఎస్. లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది. అత్యవసర ప్రయాణాలు చేసే వారికి అధిక ధరలు భారంగా మారుతున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పాత చట్టం రద్దు.. కొత్త మార్గదర్శకాలపై ఆసక్తి:

బ్రిటిష్ కాలం నాటి 1934 నాటి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ స్థానంలో కేంద్రం ‘భారతీయ వాయుయాన్ అధినియమ్-2024’ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, కొత్త నిబంధనలు నోటిఫై అయిన తర్వాతే టికెట్ ధరలపై పరిమితి, పర్యవేక్షణ విధానం ఎలా ఉండబోతోందనేది పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!