వెంకటేష్ మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్

Must read

దసరా సెలవులు బాక్సాఫీస్ కు మంచి రెవిన్యూ తెచ్చే సీజన్. సరిగ్గా వాడుకుంటే పది రోజుల పాటు థియేటర్లకు కలెక్షన్లు వస్తాయి. సంక్రాంతి అంత కాకపోయినా అందులో ముప్పాతిక శాతం కెపాసిటీ ఈ పండగకు ఉంది. అయితే ఈసారి టాలీవుడ్ నుంచి టయర్ వన్ స్టార్ హీరో సినిమా ఏదీ లేకపోవడం ఎంత లోటో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. జైలర్ 2 కి కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నా ఈ మాత్రం చాలులెమ్మని జనం భారీగా టికెట్లు కొంటున్న వైనానికి బుక్ మై షో నెంబర్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

చెప్పాలంటే వెంకటేష్ ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. ఎందుకంటే ఒకవేళ ఆదర్శ కుటుంబం ఏకె 47 కనక అక్టోబర్ తొమ్మిది లేదా ఇవాళో రేపో వచ్చి ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేవాళ్ళు. అందులోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం కాబట్టి ఆ బ్రాండ్ బలంగా పని చేసేది. ఇక నార్త్ అమెరికా సంగతి సరేసరి. ట్రైలర్ వచ్చాక అమాంతం సేల్స్ పెరిగేవి. కానీ ఇప్పుడది జరగలేదు. దాన్ని జైలర్ 2, రణబాలితో పాటు గరివిడి లక్ష్మి, క్రేజీ కళ్యాణం వాడుకోబోతున్నాయి.

ఇంత జరిగినా ఆదర్శ కుటుంబం కొత్త డేట్ ఇప్పటికీ ఫైనల్ కాలేదు. జైలర్ 2 పంపిణీలో బిజీగా ఉన్న నాగవంశీ ఇకపై వెంకీ మూవీ మీద ఫోకస్ పెట్టాల్సిన టైం వచ్చేసింది. ఈ నెలాఖరుకి వస్తుందా లేక నవంబర్ కు షిఫ్ట్ అవుతుందానే క్లారిటీ వీలైనంత త్వరగా ఇస్తే బెటర్. ఇప్పటికే ఆదర్శ కుటుంబం, జనవరి 12 విడుదల మధ్య గ్యాప్ అంతకంతా తగ్గిపోతోందని దగ్గుబాటి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. రెండింటి మధ్య కనీసం మూడు నెలల గ్యాప్ కూడా వచ్చేలా లేదు.

అసలు ఆదర్శ కుటుంబం ఈ ఏడాది వదిలే ఉద్దేశం ఉందా లేదా అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేయడం గమనించవచ్చు. ఏపీ తెలంగాణ జైలర్ 2 వసూళ్లు మెల్లగా పెరగడం చూస్తే ఎవరికైనా ఆ మాత్రం అసహనం కలగడం సహజం. తమన్ రీ రికార్డింగ్ ఎంతవరకు వచ్చిందో సారైనా సమాచారం లేదు. అనిల్ రావిపూడి ఊటీ షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకటేష్ హైదరాబాద్ తిరిగి వచ్చాక నిర్ణయం తీసుకోవచ్చు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!