జైలర్ 2’పై నా అభిప్రాయం అడిగారు.. ఎస్.జె. సూర్య గొప్ప మనసుకు ఫిదా అయిన తల్లాడ సాయి కృష

Must read

ఎదుగుతున్న ఫిల్మ్ మేకర్స్‌ను గుర్తించడం గొప్ప విషయం: ఎస్.జె. సూర్యపై తల్లాడ సాయి కృష్ణ ప్రశంసలు

సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన ఎస్.జె. సూర్య ఎదుగుతున్న ఫిల్మ్ మేకర్స్‌కు ఇచ్చే ప్రోత్సాహం తనను ఎంతో ఆనందానికి గురిచేసిందని ఫిల్మ్ మేకర్ తల్లాడ సాయి కృష్ణ అన్నారు. ‘జైలర్ 2’ సినిమా ఎలా ఉందని, తన అభిప్రాయం ఏమిటని అడిగి తెలుసుకోవడం ఎస్.జె. సూర్య గొప్ప మనసుకు నిదర్శనమని ప్రశంసించారు.

ఇటీవల ఎస్.జె. సూర్యతో వీడియో కాల్‌లో మాట్లాడిన అనంతరం తల్లాడ సాయి కృష్ణ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నప్పటికీ, తనలాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఫిల్మ్ మేకర్స్‌ను గుర్తించి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ప్రత్యేకమైన విషయమని పేర్కొన్నారు.

ఒక అభిమానికి తన అభిమాన నటుడితో మాట్లాడే అవకాశం లభిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, అదే సమయంలో సినీ రంగంలో ఎదగడానికి ప్రయత్నిస్తున్న తమలాంటి వారిని గుర్తించి మాట్లాడటం మరింత ప్రోత్సాహాన్నిస్తుందని సాయి కృష్ణ తెలిపారు.

సినిమా గురించి అభిప్రాయం అడగడమే కాకుండా, కొత్తగా ఎదుగుతున్న వారి ఆలోచనలను గౌరవించడం ఎస్.జె. సూర్య వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోందని అన్నారు. ఆయన చూపించిన ఆప్యాయత, తనకు ఇచ్చిన గౌరవం ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

ఒక గొప్ప నటుడిగా మాత్రమే కాకుండా, ఇతరులను ప్రోత్సహించే వ్యక్తిగా కూడా ఎస్.జె. సూర్యపై తనకు మరింత గౌరవం పెరిగిందని తల్లాడ సాయి కృష్ణ ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!