
CM Revanth Reddy : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. గురువారం ఎల్నినో (Elnino) కారణంగా తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తదితర విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరించారు.


