Apple iPhone 17 Pro : సూపర్ ఆఫర్ భయ్యా.. ఐఫోన్ 17 ప్రో ఇలా కొన్నారంటే రూ.13వేలు తక్కువకే.. ఈ డీల్ మిస్ చేయొద్దు..!

Must read

Apple iPhone 17 Pro

6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌, 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా
క్రోమాలో ఐఫోన్ 17 ప్రో రూ.13,000 తక్కువ ధరకే సొంతం

Apple iPhone 17 Pro : అసలే పండుగ సీజన్.. ఈ-కామర్స్ సైట్లు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఐఫోన్ 17 ప్రోపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అత్యంత చౌకైనది కాదు. క్రోమాలో ఐఫోన్ 17 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఐఫోన్‌లో కంపెనీ 48MP ప్రైమరీ కెమెరా 18MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ధరపై పూర్తి వివరాలివే..

ఐఫోన్ 17 ప్రో ధర ఆఫర్లు :
ఐఫోన్ 17 ప్రో (256GB స్టోరేజ్ వేరియంట్) ప్రస్తుతం క్రోమాలో రూ.1,26,990 ధరకు లభిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఐఫోన్ 17  (Apple iPhone 17 Pro) ధర రూ.1,34,900గా ఉండేది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.5వేలు తగ్గింపు లభిస్తోంది. తద్వారా ధర రూ.1,21,990కి చేరింది. ఈ ఐఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారు రూ.13వేలు తక్కువకే లభిస్తోంది.

Read Also : Tata Play Smart TV : టాటా ప్లే స్మార్ట్ యాప్.. కేబుల్-DTH అక్కర్లేదు.. మీ టీవీలో 500కుపైగా లైవ్ ఛానెళ్లు చూడొచ్చు!

ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17 ప్రోలో 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఆపిల్ A19 ప్రో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఐఫోన్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టిన్స్ కోసం IP68-రేటింగ్‌తో వస్తుంది.

ఈ ఐఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.78 అపర్చర్‌తో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా, ఎఫ్/2.8 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/1.9 అపర్చర్‌తో 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. యూఎస్‌బీ 3.0 టైప్-సి పోర్ట్, 5జీ, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6తో వస్తుంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!