Infinix Xpad 30 Pro: 2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో కొత్త టాబ్లెట్..

Must read

ప్రముఖ స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ సంస్థ ఇన్ఫినిక్స్ గ్లోబల్ మార్కెట్లలో కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసింది. Infinix Xpad 30 Pro పేరుతో తీసుకొచ్చిన ఈ టాబ్లెట్‌ ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. 11 అంగుళాల 2.5K డిస్‌ప్లే, MediaTek Helio G200 Ultimate ప్రాసెసర్‌, 8200mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మూడు కలర్ ఆప్షన్లలో ఈ టాబ్లెట్‌ను కంపెనీ అందిస్తోంది.

11 అంగుళాల 2.5K డిస్‌ప్లే

Infinix Xpad 30 Proలో 11 అంగుళాల 2.5K డిస్‌ప్లేను అందించారు. ఇది 85 శాతం స్క్రీన్‌-టు-బాడీ రేషియోతో వస్తుంది. 60Hz, 90Hz రిఫ్రెష్ రేట్‌లకు సపోర్ట్ చేసే ఈ స్క్రీన్ గరిష్ఠంగా 550 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం Panda MN228 కవర్ గ్లాస్‌ను ఉపయోగించారు.

అలాగే TÜV Rheinland నుంచి Hardware-Level Low Blue Light, Flicker-Free సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. దీంతో ఎక్కువసేపు టాబ్లెట్‌ను ఉపయోగించే వారికి డిస్‌ప్లే అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉండేలా కంపెనీ ఫోకస్ చేసింది.

8GB RAM.. 256GB స్టోరేజ్

పనితీరు కోసం MediaTek Helio G200 Ultimate ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను అందించారు. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPU ఉంది. గరిష్ఠంగా 8GB RAM, 256GB UFS 2.2 స్టోరేజ్‌ వరకు ఈ టాబ్లెట్‌లో లభిస్తుంది. వర్చువల్ RAM ఫీచర్ ద్వారా RAMను 16GB వరకు పెంచుకునే అవకాశం ఉంది.

స్టోరేజ్ తక్కువగా అనిపించే వారికి microSD కార్డు ద్వారా ఏకంగా 2TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం కూడా ఉంది. దీంతో సినిమాలు, వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు వంటి వాటిని ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు.

రెండు 8MP కెమెరాలు

ఫొటోలు, వీడియోల కోసం వెనుక భాగంలో 8MP కెమెరాను అందించారు. ఇందులో f/2.0 అపెర్చర్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలోనూ 8MP కెమెరా అందించారు. రెండు కెమెరాలతో గరిష్ఠంగా 2K రిజల్యూషన్‌లో 30fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.

8200mAh బ్యాటరీ

Infinix Xpad 30 Proలో 8200mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీను అందించారు. దీనికి 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. టాబ్లెట్ కొలతలు 254.04 × 165.55 × 6.6 మిల్లీమీటర్లు కాగా.. బరువు 476 గ్రాములుగా ఉంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే 4G, Wi-Fi, Bluetooth 5.3, GPS, USB Type-C వంటి ఆప్షన్లు ఉన్నాయి. DTS సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లను కూడా అందించారు. G-సెన్సార్, e-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, SAR సెన్సార్ వంటి సెన్సార్లు ఇందులో ఉన్నాయి.

X Pencil 20, X Keyboard 11 కూడా..

టాబ్లెట్‌తో పాటు X Pencil 20, X Keyboard 11 యాక్సెసరీలను కూడా బండిల్‌గా అందిస్తున్నారు. దీంతో నోట్ టేకింగ్, టైపింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ వంటి పనులకు టాబ్లెట్‌ను మరింత సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ పరంగా Infinix Xpad 30 Pro Android 16 ఆధారిత XOS 16.3పై పనిచేస్తుంది. ఆంత్రాసైట్ గ్రే, ట్విలైట్ పర్పుల్, టైటానియం సిల్వర్ రంగుల్లో ఈ టాబ్లెట్‌ అందుబాటులోకి వచ్చింది.

ధర ఎంత?

Infinix Xpad 30 Pro ప్రారంభ ధరను $196గా కంపెనీ నిర్ణయించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.18,000కు సమానం. 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్లలో టాబ్లెట్‌ లభిస్తుంది.

అయితే భారత మార్కెట్లో ఈ టాబ్లెట్ ఎప్పుడు విడుదల అవుతుంది? ఏ ధరలకు అందుబాటులోకి వస్తుంది? అనే వివరాలను ఇన్ఫినిక్స్ ఇంకా వెల్లడించలేదు. భారత మార్కెట్‌లో అధికారిక లాంచ్‌పై కంపెనీ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!