Wednesday, July 29, 2026

వైరల్‌గా మారిన బండ్ల గణేష్​ కుమార్తె జనని వివాహ ఆహ్వాన పత్రిక

Must read

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. కుమార్తె జనని వివాహం వచ్చే నెలలో జరగనుంది. ఈ సందర్భంగా ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆహ్వాన పత్రికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేర్లు కనిపించడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చానీయంగా మారింది.

ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరగనుంది. ఉదయం 11:58 గంటలకు శుభ ముహూర్తం నిర్ణయించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం తొలి ఆహ్వాన పత్రికను తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రెండో శుభలేఖను నారా భువనేశ్వరికి అందజేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలో చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి పేర్లు ఉండటం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు ఈ ఆహ్వాన పత్రికను తమ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకుంటూ బండ్ల గణేశ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఆహ్వాన పత్రికలో ఆ పేర్లు ఉండటానికి సంబంధించిన వివరణపై బండ్ల గణేశ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన బండ్ల గణేశ్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తన స్పష్టమైన అభిప్రాయాలు, రాజకీయ అంశాలపై స్పందనలు, సామాజిక మాధ్యమాల్లో చురుకైన వ్యవహారశైలితో కూడా ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు కుమార్తె వివాహం సందర్భంగా మరోసారి ఆయన పేరు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తోంది.

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖుల కుటుంబాల్లో జరిగే వివాహ వేడుకలు సాధారణంగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం కూడా ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. వివాహ తేదీ సమీపిస్తున్న కొద్దీ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుండగా, బండ్ల గణేశ్ కుటుంబానికి అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆగస్టు 16న జరగనున్న ఈ వివాహ వేడుక టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించే అవకాశముంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!