Friday, June 26, 2026

విజయ్ సేతుపతి–నిత్యా మీనన్ జంటగా ‘సార్‌ మేడమ్‌

Must read

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన కొత్త చిత్రం ‘సార్‌ మేడమ్‌’ జూలై 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘A Rugged Love Story’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామాకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.

ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.

ట్రైలర్‌ను లాంచ్ చేసిన చిత్రబృందం
చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం, తాజాగా ట్రైలర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ భార్యభర్తలుగా మన ముందుకు రాబోతున్నారు. ఇద్దరి మధ్య జరిగే తక్కువ మాటల గొడవలు, పెళ్లి తర్వాత జీవితంలోని సరదా సంఘర్షణలు న‌వ్వులు పంచేలా చిత్రీకరించబడ్డాయి.

ట్రైలర్‌ చూస్తేనే సినిమాలోని హాస్యభరిత దృశ్యాలు, కుటుంబ సంబంధాలపై కేంద్రంగా సాగే కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని అర్థమవుతోంది. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది.

ఇతర తారాగణం, సంగీతం, సాంకేతిక బృంద వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. జూలై 25న విడుదల కాబోతున్న ‘సార్‌ మేడమ్‌’ చిత్రానికి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, ఇది విజయ్ సేతుపతి – నిత్యా మీనన్ జంటకు మరో హిట్ అవుతుందా అనే ఆసక్తి నెలకొంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!