బెల్లంకొండ గణేశ్ తన రెండో సినిమాగా 'నేను స్టూడెంట్ సర్' చేశాడు. 'నాంది' సతీశ్ నిర్మించిన ఈ సినిమాకి, రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. జూన్ 2వ తేదీన థియేటర్స్ కి ఈ సినిమా వచ్చింది. భాగ్యశ్రీ కూతురు అవంతిక ఈ సినిమాతోనే కథానాయిక తెలుగు తెరకి పరిచయమైంది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా'లో స్త్రీమింగుకి రెడీ అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అంటే రేపు లేదు ఎల్లుండి నుంచి ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేయనుంది. సముద్రఖని కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. 

ఈ కథ అంతా కూడా హీరో తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న 'ఐ ఫోన్' చుట్టూ తిరుగుతుంది. లవ్ తో పాటు, కామెడీ టచ్ తో సాగే యాక్షన్ ఎంటర్టయినర్ ఇది. యూత్ ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన కాన్సెప్ట్ ఇది. మరి ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.