ఐసీయూలో లతా మంగేష్కర్
గాయని లతా మంగేష్కర్(92)కు కరోనా సోకడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని లతా మంగేష్కర్ కజిన్ రచన మీడియాకు తెలిపారు. లతా మంగేష్కర్‌కు స్వల్ప లక్షణాలున్నాయని, కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారని ఆమె తెలిపారు.దయచేసి తమ గోప్యతను గౌరవించాలని, తమ అక్క గురించి ప్రార్థించాలని రచన కోరారు.
Share this article in your network!