సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం విచిత్రమైన కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటాడు. ఆయన ట్విట్టర్ లో చేసే ట్వీట్స్ కాదు, సినిమాలు కూడా వివాదాస్పదం అవుతుంటాయి. 

అయితే ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే రామ్ గోపాల్ వర్మ గాన కోకిల లతా మంగేష్కర్ మరణించడంతో అలా మనిషి చనిపోతే బాధపడొద్దు అంటూ కొత్త లాజిక్‌ను చెప్పారు.Ram Gopal Varma Comments on Elders 

ఒక మనిషి చనిపోతే.. ఆర్‌ఐపీ అని చెప్పడం వారిని అవమానించడమే. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకునేవారిని బద్ధకస్తులు అంటుంటారు. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఆర్‌ఐపీ అని చెప్పకుండా మంచి జీవితంలో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చెయ్యి’ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ కొత్త లాజిక్‌ను విని ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో పాటు ట్విటర్ వేదికగా ఆర్జీవి మరో లాజిక్ కూడా భోదించారు. ఈసారి ఎవరూ ఊహించని రితీలో తన బాల్యంలోనే తన భావాలను ట్వీట్‌లో వివరించాడు. 

ఇంతకి వర్మ ఏమన్నాడంటే.. 'పెద్దవాళ్లు మాత్రమే పిల్లలను పిల్లలుగా చూస్తుంటారు. కానీ ఏ పిల్లలు(బాలుడు, బాలికలు) మాత్రం తమని తాము చిన్నిపిల్లలం అని ఎప్పుడూ అనుకోరు. నేను అయితే నా చిన్నతనంలో పెద్దవాళ్లంతా ఇడియట్స్‌ అనుకనేవాడిని. అందుకే ఎప్పటికి నేను పెద్దవాడిని కావోద్దని కోరుకునే వాడిని' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పెద్దవాళ్లపై వర్మ ఆలోచనలు చూసి నెటిజన్లు తమదైన శైలో స్పందిస్తున్నారు. 

రామ్ గోపాల్ వర్మ మాటలు, ఆయన ట్వీట్లు సాధారణంగా అర్థం కావు. కనిపించేది ఒక అర్థమైతే.. నిగూఢార్థం వేరే ఉంటుంది. అది కొంత మందికి మాత్రమే అర్థమవుతుంది. తిడుతున్నాడా? పొగుడుతున్నాడో తెలియకుండా ఆర్జీవీ ట్వీట్లు వేస్తుంటాడు. వర్మ ధాటికి ట్విట్టర్లో ఫ్యాన్స్ వార్ కూడా జరుగుతుంటుంది. మొన్నటి వరకు బన్నీ పొగుడుతూ ట్వీట్లు వేసి మిగతా మెగా హీరోలను తక్కువ చేసిన సంగతి తెలిసిందే.