చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు
చైనాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రారంభమై నప్పటి నుంచి ఇప్పుడే అధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
ఒక్కరోజులో 5,280 కేసులు నమోదయ్యాయి. ముందురోజుతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు రావడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కట్టడికి పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించారు. 13 నగరాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించగా, మరికొన్ని నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. దీంతో మొత్తం 3 కోట్ల మంది ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. టెక్నాలజీ పరంగా ఎంతో ముఖ్యమైన షెంజెన్ నగరం పూర్తిగా మూతపడింది. అమెరికాలో కూడా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
Share this article in your network!