అదానీ గ్రూప్‌కి ఎస్‌బిఐ 12770 కోట్లు మాఫీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను -<br>సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాదు, 31.03.2022, ప్రచురణార్థం/ప్రసారార్థం:
ముంబాయి ఎయిర్ పోర్టును గతంలో జివికె సంస్థ వారు బాగా నిర్మించారు. భారత దేశంలో ఇది నవంబర్ వన్ అధునాతమైన ఎయిర్ పోర్టు అది. ఫైనాన్షియల్ సిటి బాంబేలో ఇతరలు ఉండటానికి వీలు లేదని అదాని జివికె మెడ మీద కత్తి పెట్టి దాన్ని లాగేసుకున్నారు. దానికి కారణం మీకు అప్పులున్నాయి. ఆ అప్పులు మీరు కట్టలేరు కనుక మీరు దాన్ని మాకిచ్చి వెళ్లిపోతారా లేదా జైలుకు పోతారా అని తేల్చుకోండి అనేసరికే జివికె గారు మర్యాదగా సంతకం పెట్టి వచ్చేశారు. ఆయన అడిగినప్పుడు కేంద్రం లోన్లకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు అదాని చేతికి వెళ్లిన తరువాత ఎస్‌బిఐ 12, 770 కోట్ల రూపాయల లోను రద్దు చేసింది. ఎవడబ్బ సొమ్మని దీన్ని రద్దు చేశారు? కష్టపడి అభివృద్ది చేసిన జివికెకు సహాయం చేయకుండా, అయన నుండి ఊడ గొట్టి, అదాని గ్రూపుకి అప్పజెప్పి, ఇప్పుడు అదాని గ్రూపుకు వెళ్లిన తరువాత, అదాని దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతున్నాడని ఎస్‌బిఐ ఇంత పెద్ద మొత్తం రద్దు చేయడం ఎవడబ్బసొత్తు? అదానికే దేశంలోని పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లను అప్పజెప్పాలా?
మరోవైపు పాండిచ్చేరిలో జివికె అభివృద్ధి చేసిన చిన్న కారేకల్ పోర్టును కూడా మీకు అప్పులున్నాయని తీసేసుకొన్నారు. అంటే గుజరాత్ ముంద్రా నుండి పాండిచ్చేరి కారేకాల్ దాకా సముద్రతీర ప్రాంతం మొత్తం అదానీకే ఉండాలి. ఎయిర్‌పోర్టులు ఆయనకే ఉండాలి. స్మగ్లింగ్ చేసుకోవడానికి అనువుగా ఉండాలని సముద్ర తీర ప్రాంతం, అధునాతన ఎయిర్ పోర్టులను అదానికి అప్పగించారు. అదానికి ఆస్థులు కట్టబెట్టే మార్గంలో జివికెకు మరియు కారేకల్‌కు తీవ్ర కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. దీన్ని బట్టి కేంద్రం ప్రభుత్వం అదానికే అమ్ముడిపోయే పరిస్థితిలో పనిచేయడాన్ని మేము ఖండిస్తున్నాం.
Share this article in your network!