మంత్రి పువ్వాడపై రేణుకా చౌదరి ఫైర్
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై ఫైర్ అయ్యారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. పువ్వాడ అజయ్ కి.. కేటీఆర్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించారామె. ఖమ్మంలో జరుగుతున్న అన్యాయాలపై పువ్వాడ మీద ఎందుకు చర్యలు తీసుకోరంటూ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యపై ఆమె స్పందించారు. ఇంత అన్యాయం జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జరుగుతున్న అక్రమాలు కేటీఆర్‌కు తెలియవా..? అంటూ ప్రశ్నించారు. పువ్వాడను మంత్రివర్గం నుంచి తొలగించాలని.. లేదంటే టీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని వ్యాఖ్యానించారు.
Share this article in your network!