తెలంగాణ గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వంపైనా.. ప్రత్యేకించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తానేమీ రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ను కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలమే రేపుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళిసై అక్కడే కేసీఆర్ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… "సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం నాకు పెద్ద సవాల్.
సీఎం చెప్పారని ఫైల్‌పై సంతకం చేయడానికి నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ను కాను. రాజకీయంలో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు. ఇప్పుడు గవర్నర్‌గా ఉన్నప్పుడు నాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తనన్ను వేరే రాష్ట్రానికి మారుస్తారనేది వాస్తవం కాదన్నారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే తనపై అసత్య ప్రచారం చేశారన్న తమిలిసై… సీఎం, గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా ఉంటుందో తెలంగాణను చూస్తే తెలుస్తుంది" అన్నారు.
Share this article in your network!