దాదాపు సంవత్సరం కిందట హైదరాబాద్, అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో చిన్న పిల్లాడు చనిపోయిన విషయం పెను దుమారం సృష్టించింది, ఎంతో మంది ఈ విషయమై ధ్వజమెత్తినా కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసినదే. అయితే ఇంత జరిగినా కూడా రోజురోజుకి నగరంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ జనాలపై దాడి చేస్తున్నాయి. 

అయితే ఈ విషయమై మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఘాటుగా స్పందించారు. అంబర్ పేటలో బాలుడి సంఘటన జరిగి సంవత్సరం అవుతున్నా కూడా వీధి కుక్కల విషయంలో GHMC వైఖరి ఏ మాత్రం మారలేదని అన్నారు, అప్పట్లో హై లెవెల్ కమిటీలు పెట్టి అనేక చోట్ల నుండి నివేదిక తీసుకున్న తరువాత కూడా నివేదికలో ఉన్నటువంటి అంశాలను ఇప్పటి వరకూ కూడా ఆచరణలోకి GHMC తీసుకురావడంలేదని ధ్వజమెత్తారు.ఇంకా మాట్లాడుతూ కృపా కాంప్లెక్స్ వద్ద నిన్ననే పారిశుధ్య కార్మికురాలిని కుక్క దాడి చేసిందని, వెంటనే ఈ విషయం గురుంచి GHMC కమిషనర్ అమ్రాపాలికి, హై లెవల్ కమిటీకి తెలియజేశానని, సరిపడిన బడ్జెట్ ఉన్నా కూడా నగరంలో వీధి కుక్కల నివారణలో GHMC ఘోరంగా విఫలం చెందిందని,దానికి ఉదాహరణే నిన్న జరిగిన సంఘటన అని మండిపడ్డారు. ఎన్ని పర్యాయాలు విన్నవించుకున్నా GHMC నుండి సరైన స్పందన లేదని, వైఖరి మార్చుకోకపోతే ఉద్యమం తలపెట్టక తప్పదని అన్నారు.