జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు వైసీపీ కి అనుకూలంగా ఉన్నవారు నెమ్మదిగా జారుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రెస్ మీట్ పెట్టి ఆశక్తికర విషయాలు వెల్లడించారు. 

ఇప్పటికే ఈ స్వామీజీకి వైసీపీ స్వామిగా ముద్ర పడిపోయింది, పీఠానికి సంబందించిన ఉత్తరాధికారిని ప్రకటించే సమయంలోనూ అప్పటి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులైన కే సీ ఆర్ , వై ఎస్ జగన్ ముఖ్యఅతిధులుగా హాజరైన విషయం అందరికీ తెలిసిందే. 

స్వామీజీకి సూటి ప్రశ్నలు

రాజకీయాలకు అతీతంగా ఉండవలసిన మీరు ఒక పార్టీకి సపోర్ట్ గా ఉండడం ఎంతవరకు సమంజసం, వై ఎస్ జగన్ పాదయాత్రకు ముహూర్తం పెట్టింది మీరు కాదా...?

ఎప్పుడూ సామాన్య ప్రజలలాగా ప్రయాణం చేసే మీకు జగన్ సీఎం అయిన తరువాత తిరగడానికి ప్రత్యేక విమానాలు ఎక్కడివి, ఎక్కడికి వెళ్లినా పోలీసు వాహనాలు ఎందుకు ?

జగన్ నా కొడుకు అని ముద్దాడిన మీరు ఇప్పుడు మాకు ఏ పార్టీకి సంబంధం లేదని అంటూ ఎవరికీ భయపడడం లేదని మీడియా ముందు మాట్లాడడం ఎందుకు ?

సనాతన ధర్మాన్ని కాపాడవలసిన మీరు హిందూ ధర్మం పై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు, మీ ముద్దు బిడ్డగా చెప్పుకునే సీఎంను ఏనాడైనా ప్రశ్నించారా?

సింహాచలంలో చందనోత్సవం సమయంలో ప్రభుత్వ వైఫల్యంతో భక్తులు ఇబ్బందిపడుతున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో అధికార వైఫల్యం అన్న మీరు వెంటనే నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ఎందుకు చెప్పవలసి వచ్చింది?

అంతర్వేదిలో రధం కాలినప్పుడు, దుర్గ గుడిలో వెండి విగ్రహాలు మాయమైనప్పుడు,తిరుమలలో అన్యమతస్థులు పెట్రేగిపోతున్నప్పుడు మీ పీఠం తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు లేదా ?

హోమాలు, యాగాలతో ముఖ్యమంత్రులను చేసే మీకు టి.టి.డి లో జరిగే అవకతవకలు కనిపించలేదా ? 

దేవుడి దర్శనం వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతుంటే మీ మనసు చలించలేదా స్వామి ?

ఇన్నాళ్లు మీకు దేవాదాయశాఖలో అవకతవకలు కనపడలేదా, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇప్పటికైనా దేవాదాయ శాఖ బాగుండాలి అనడంలో అర్ధం ఏమిటి ?

మీకు చెప్పేంత గొప్పవాళ్ళం కాదు కానీ మీరు ఇప్పటికైనా ఎటువంటి రాజకీయ పార్టీలకు సపోర్ట్ గా కాకుండా సనాతన ధర్మానికి నష్టం జరుగుతుంటే ప్రశ్నించే గొంతులా మారాలని కోరుకుంటున్నాం.