గ్రామీణ రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తాంః మంత్రి సీతక్క
పంచాయతీరాజ్ శాఖపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గ్రామీణ రహదారుల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ నిధుల ఉపయోగించి గ్రామీణా రహదారుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. పంచాయతీలు, గ్రామీణ స్థానిక సంస్థలలో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు . పంచాయితీల మౌలిక సదుపాయాల కోసం కొత్త పనులను ప్రతిపాదనలు పంపాలని కోరారు. పంచాయతీల్లో ఇప్పటికే పాడైన రోడ్లకు మరమ్మత్తులు, కొత్త రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై అంచనాలు తయారు చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న పనుల్లో నాణ్యత పెంచే విధంగా తీసుకోవాలని త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. నణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ ఇఎన్‌సి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Share this article in your network!