విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ వేళ ఎవరైనా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రింద కేసులను నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. నాల్గవ తేదీన ఎనమాముల మార్కెట్ లో నిర్వహించబడే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుగాను ప్రత్యేక భద్రత ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని. ఇందుకోసము ముగ్గురు డీసీపీలు, పది మంది ఏసీపీలు, 29మంది ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఐలు, సబ్ - ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఎస్.ఐలు 52 మంది, ఏ. ఎస్. ఐలు / హెడ్ కానిస్టేబుళ్ళు 77 మంది,పోలీస్ కానిస్టేబుళ్ళు 172,మహిళా కానిస్టేబుళ్లు 48, హోంగార్డులు 44, 32మంది క్యూ ఆర్. టీమ్స్, మూడు టిజీ ఎస్. పి ప్లాటూన్స్ , వీరితో పాటు బాంబ్ డిస్పోజబుల్ టీమ్స్, కమ్యూనికేషన్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారు. ఓ ఓట్ల లెక్కింపు రోజున 144 అమలు చేయబడటంతో పాటు ఎలాంటి వూరేగింపులు, సభలు, సమావేశాలను నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటన తెలిపారు.
Share this article in your network!