ఏపీ పరిస్థితులపై కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: సీపీఐ నారాయణ
పొరుగు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తన స్వగ్రామం అయనంబాకం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని కూడా నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉంటే… పొరుగు రాష్ట్రాల్లో మాత్రం రోడ్లు చక్కగా ఉన్నాయని నారాయణ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని నారాయణ ఆధారాలను చూపిస్తూ మరీ చెప్పడం గమనార్హం.
కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రా- తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని నారాయణ సందర్శించారు. ఏపీ రోడ్లతో తమిళనాడు రోడ్లను ఆయన పోల్చి చూశారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే…. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన అన్నారు.
Share this article in your network!