పంజా విసురుతున్న కరోనా..
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 12,213 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. పెరుగుతున్న కేసులు ఫోర్త్ వేవ్ కు సంకేతమా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు గత 24 గంటల్లో 7,624 మంది కోలుకోగా.. 11 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 58,215 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల్లో మహారాష్ట్ర నుంచి 4,024… కేరళ నుంచి 3,488 వచ్చాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,57,730కి చేరుకున్నాయి. వీరిలో 4,26,74,712 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు 5,24,803 మంది మృతి చెందారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.13 శాతంగా, రికవరీ రేటు 98.65 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1.95 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 15,21,942 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Share this article in your network!