పాత 137వ డివిజన్ పరిధిలోని వినాయక్‌నగర్, కాకతీయనగర్ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులకు బడ్జెట్ కేటాయించి త్వరితగతిన పనులు చేపట్టాలని వినాయక్‌నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు. ఈ మేరకు మేడ్చల్–మల్కాజ్గిరి కమిషనర్ సంచిత్ గంగ్వార్ IASను కలిసి వినతిపత్రం (Representation) అందజేశారు.
ప్రత్యేకంగా జేకే కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆమె కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు పనులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ సంచిత్ గంగ్వార్ స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని, రోడ్డు పనులకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు, పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు క్యానం రాజ్యలక్ష్మి తెలిపారు.




