రెండో టెస్టులోనూ ద‌క్క‌ని చోటు.. సిరాజ్ క‌న్నీళ్లు? జ‌ట్టులోకి తీసుకోకుంటే ఎంపిక చేయ‌డం ఎందుకు?

Must read

Mohammed Siraj : న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్‌ సిరాజ్‌కు రెండో టెస్టు మ్యాచ్‌లోనూ చోటు ద‌క్క‌లేదు. సిరాజ్‌కు చోటు ద‌క్క‌లేదు. టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణ‌యం పై మాజీ ఆట‌గాళ్లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. అన్ని ఫార్మాట్ల‌లో సిరాజ్‌కు త‌గిన‌న్ని అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోవ‌డంపై భారత మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ తీవ్రంగా మండిప‌డుతున్నాడు.

సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత మాజీ ఆట‌గాడు ర‌హానేతో జరిగిన చర్చ సందర్భంగా కార్తీక్ త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. వీరిద్ద‌రు మాట్లాడుతుండ‌గా.. సిరాజ్ తన సన్‌గ్లాసెస్ వెనుక భావోద్వేగాలను దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కెమెరాల్లో కనిపించింది.

ఈ క్రమంలో మురళీ కార్తీక్.. ‘అతను ఏడుస్తున్నాడా?’ అని ప్రశ్నించగా, రహానే తనకు కచ్చితంగా తెలియదన్నట్లుగా సైగ చేశారు. దీనిపై కార్తీక్ స్పందిస్తూ.. సిరాజ్ చాలా భావోద్వేగపరుడైన వ్యక్తి. అతడి ముఖంలో భావోద్వేగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అని అన్నాడు.

తాను భారత జట్టులో ఉన్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను దగ్గరగా గమనించిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. జట్టులో స్థానం కోల్పోయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని చెప్పారు.

‘జట్టులో నుంచి తప్పించినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. కొందరు దాన్ని సాధారణంగా తీసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడాలని కోరుకుంటారు. కాళ్లకు నొప్పి ఉన్నా, తలనొప్పి ఉన్నా, శరీరం సహకరించకపోయినా మైదానంలో తమ శక్తినంతా ధారపోస్తారు. సిరాజ్ కూడా అలాంటి ఆటగాడే.’ అని కార్తీక్ తెలిపాడు.

టీమ్ మేనేజ్‌మెంట్‌పై కార్తీక్ అసహనం

సిరాజ్‌ను పర్యటనకు ఎంపిక చేసి, ఆడించే ఉద్దేశం లేకపోవడంపై కార్తీక్ తీవ్రంగా ప్రశ్నించారు. ‘ఇప్పటివరకు అతడి గణాంకాలను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. అతడి ఫామ్ బాగోలేదని, నెట్స్‌లో సరిగ్గా బౌలింగ్ చేయడం లేదని భావిస్తే అసలు పర్యటనకే ఎందుకు ఎంపిక చేశారు? జట్టులోకి తీసుకురావడం, ఆడించే అవకాశం ఇవ్వకపోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అతడిని ఎంపిక చేయకపోవడమే మంచిది కదా?’ అంటూ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేశారు.

మొత్తానికి.. సిరాజ్ వంటి పోరాట పటిమ కలిగిన బౌలర్‌కు తగిన అవకాశాలు కల్పించాలని మురళీ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article