ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆపిల్ ఐఫోన్ 18, 18eలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్!

Must read

  • ఈ ఆపిల్ ఐఫోన్ 18లో OLED డిస్‌ప్లేతో పాటు కొత్త చిప్‌సెట్
  • ఐఫోన్ 18 కంపెనీ స్టాండర్డ్ డైనమిక్ ఐలాండ్ డిజైన్‌తో రావొచ్చు
  • ఐఫోన్ 18ఇ సరసమైన వెర్షన్ కూడా లాంచ్ అయ్యే ఛాన్స్

Apple iPhone 18 Series Launch : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆపిల్‌కు క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త ఐఫోన్ వస్తుందంటే చాలు.. ఫీచర్లు, ధర, డిజైన్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.

ఇప్పుడు ఐఫోన్ 18 సిరీస్ గురించి కూడా ఇలాంటి చర్చే మొదలైంది. ముఖ్యంగా ఐఫోన్ 18, ఐఫోన్ 18ఇ మోడళ్లకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

పాత ఫీచర్లు కొనసాగించే అవకాశం :
లీకుల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18లో 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండొచ్చు. 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ స్పెషల్ అని చెప్పొచ్చు.. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఆపిల్ కొత్త A20 చిప్‌సెట్‌ను ఇందులో వాడే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ప్రస్తుత డైనమిక్ ఐలాండ్‌ను కొనసాగించవచ్చని సమాచారం..

Read Also : 

మరోవైపు బడ్జెట్‌లో ఐఫోన్ కొనాలనుకునే వారికి ఐఫోన్ 18ఇ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 6.12 అంగుళాల ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చని అంచనా. A20 చిప్‌తో పాటు 9GB ర్యామ్ అందించే అవకాశముంది.. కెమెరా విషయానికి వస్తే, వెనుకవైపు 48MP కెమెరా, ఫ్రంట్ సైడ్ 24MP కెమెరా ఉండొచ్చని తెలుస్తోంది..

ధర భారీగా పెరిగే ఛాన్స్ :
ఇక ధర విషయంలో మాత్రం ఐఫోన్ ప్రియులకు కొంత షాక్ తగలనుంది. మెమరీ స్పేప్ పార్టుల ధరలు పెరుగుతుండటంతో కొత్త ఐఫోన్ల ధరలు కూడా పెరగవచ్చనే అంచనాలున్నాయి. గతంలో భారత్‌లో ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900గా ఉంది.

అయితే, ఈ వివరాలన్నీ ప్రస్తుతానికి లీకులు, అంచనాలకే పరిమితం. ఆపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐఫోన్ 18 సిరీస్‌లో నిజంగా ఎలాంటి మార్పులు వస్తాయో తెలియాలంటే కంపెనీ అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!