ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. దీపావళి బోనస్ వచ్చిందా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసా?

Must read

  • దీపావళి గిఫ్ట్ ఇచ్చారా? రూ.15 వేల లోపు ఉంటే ట్యాక్స్ కట్టక్కర్లేదా?
  • బోనస్ చేతికి వస్తే సరిపోదు.. ఆదాయపు పన్ను లెక్కలివే
  • క్యాష్ బోనస్ అయినా, గిఫ్ట్ వోచర్ అయినా.. పన్ను విషయంలో తేడా ఇదే

Diwali Bonus Gift Tax : దీపావళి వచ్చిందంటే ఉద్యోగులకు పండగ సంబరాలతో పాటు బోనస్ ఆశలు కూడా మొదలవుతాయి. కంపెనీ నుంచి అదనంగా డబ్బులు చేతికి వస్తే ఆ ఆనందమే వేరు. అయితే వచ్చిన బోనస్ మొత్తం మన జేబులోనే ఉంటుందనుకుంటే పొరపాటే..

ఎందుకంటే దీపావళి బోనస్‌పై కూడా ఆదాయపు పన్ను లెక్కలు ఉంటాయి. అసలు క్యాష్ బోనస్‌కు ఎంత ట్యాక్స్ పడుతుంది? గిఫ్ట్ వోచర్లకు కూడా పన్ను కట్టాలా? లేదా అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

క్యాష్ బోనస్‌పై పూర్తి పన్ను :
కంపెనీ దీపావళి సందర్భంగా క్యాష్ రూపంలో బోనస్ ఇస్తే.. దాన్ని జీతంలో భాగంగానే పరిగణిస్తారు. అంటే.. ఆ మొత్తాన్ని మీ ఏడాది మొత్తం ఆదాయానికి కలిపి, మీరు ఎంచుకున్న పన్ను విధానం ప్రకారం ట్యాక్స్ లెక్కిస్తారు. బోనస్‌కు ప్రత్యేకంగా ఎలాంటి పన్ను మినహాయింపు లేదు. ఉదాహరణకు.. ఏడాదికి రూ.12 లక్షల జీతం వస్తున్న ఉద్యోగికి రూ.2 లక్షల బోనస్ వస్తే.. మొత్తం ఆదాయం రూ.14 లక్షలుగా మారుతుంది.

Read Also : 

పాత, కొత్త పన్ను విధానాల్లో తేడా ఏంటి? :
కొత్త పన్ను విధానంలో రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్, పాత విధానంలో రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. పాత విధానంలో 80C, 80D వంటి సెక్షన్ల కింద అర్హత ఉన్న మినహాయింపులు పొందవచ్చు.

బోనస్ వల్ల పన్ను పరిధి మారితే అదనపు పన్ను భారం కూడా పెరగొచ్చు. అయితే, ఎక్కువ స్లాబ్‌లోకి వెళ్లినంత మాత్రాన మొత్తం ఆదాయంపై అధిక పన్ను పడదు. ఆ స్లాబ్‌కు సంబంధించిన ఆదాయంపైనే ఎక్కువ రేటు వర్తిస్తుంది..

గిఫ్ట్ వోచర్లకు రూ.15 వేల లిమిట్.. :
కంపెనీ క్యాష్ కాకుండా గిఫ్ట్ వోచర్లు, గిఫ్ట్ కార్డులు, పండగ హాంపర్లు ఇస్తే వాటి వాల్యూ కూడా లెక్కలోకి తీసుకుంటారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఏడాది మొత్తంలో ఇలాంటి గిఫ్ట్ వాల్యూ రూ.15 వేల లోపు ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. రూ.15 వేలు లేదా అంతకంటే ఎక్కువైతే మొత్తం దాని వాల్యూపై పన్ను వర్తిస్తుంది. క్యాష్ రూపంలో ఇచ్చే బహుమతులకు మాత్రం పూర్తిగా పన్ను ఉంటుంది.

అంతేకాదు, బోనస్ వల్ల మీ వార్షిక ఆదాయం పెరిగితే కంపెనీ జీతం నుంచి మినహాయించే టీడీఎస్ (TDS) కూడా పెరగొచ్చు. బోనస్ చేతికి రాగానే ఖర్చు చేయకుండా, పన్ను లెక్కలు కూడా ఓసారి చూసుకోవడం బెటర్..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!