Mitchell Santner : భారత్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కివీస్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమిపై కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందించాడు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడలేకపోయామన్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (38), బ్లెయిర్ టిక్నర్ (34), గ్లెన్ ఫిలిప్స్ (30)లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు సాధించాడు.
భారత జట్టు లక్ష్య ఛేదనకు దిగిన అనంతరం పలు మార్లు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ క్రమంలో తొలుత టీమ్ఇండియా టార్గెట్‌ను 40 ఓవర్లకు 167గా కుదించారు. ఆ తరువాత ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మళ్లీ వర్షం పడింది. వర్షం శాంతించిన తరువాత ఆట మరలా ప్రారంభం కాగా.. భారత జట్టు లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143గా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (74; 51 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకం చేశావడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (37; 56 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు.
పరిస్థితులకు తగ్గట్లుగా ఆడలేకపోయాం
కాగా.. తొలి వన్డేలో ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందించాడు. ఈడెన్ పార్క్‌లో పిచ్‌పై బంతి తాము ఊహించిన దానికంటే ఎక్కువగా బౌన్స్ అయిందన్నాడు. బంతి వేగం కూడా ఎక్కువగా ఉందన్నాడు. తాము పరిస్థితులకు అనుగుణంగా ఆడలేకపోయామన్నాడు. భారత బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారన్నాడు.
నిజం చెప్పాలంటే.. ఈడెన్ పార్క్‌లో బంతి బౌన్స్‌ను ఎదుర్కొంటూ ఆడటం చాలా కష్టమైన విషయమన్నాడు. భారత ఆటగాళ్లు ఆ బౌన్స్‌ను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని చెప్పాడు. ముఖ్యంగా.. శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్స్‌ను చాలా జాగ్రత్తగా ఆడాడని అన్నాడు. వర్షం తర్వాత పిచ్‌పై బంతి వేగంగా దూసుకెళ్లింది. దీంతో బ్యాటర్లకు కొన్ని షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడం సవాలుగా మారిందన్నాడు.
మా బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ప్రత్యర్థి జట్టు మంచి ఆరంభం అందుకున్న తర్వాత మేము సులభంగా ఒత్తిడికి లొంగిపోయే అవకాశం ఉంది. కానీ మా ఫాస్ట్ బౌలర్లు చివరి వరకు పోరాడుతూ తమ ప్రయత్నాలను కొనసాగించారు. వారికి అభినందనలు. ఈ మ్యాచ్ చివరి దశలో మేము కొన్ని మంచి విషయాలను నేర్చుకున్నాం. వాటిని వచ్చే వెల్లింగ్టన్ మ్యాచ్‌లో కొనసాగించడానికి ప్రయత్నిస్తాం అని మిచెల్ సాంట్నర్ అన్నాడు.


