దేశంలోనే తొలిసారిగా ఆల్-ఉమెన్ మెట్రో.. రూ.8,300 కోట్లతో లైన్-3.. అంతా మహిళల చేతుల్లోనే

Must read

Pune Pink Line Metro: మహారాష్ట్రలోని ఐటీ హబ్ పుణె నగరం రవాణా రంగంలో మరో ఘనమైన మైలురాయిని చేరుకుంది. దాదాపు రూ.8,300 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన పుణె మెట్రో లైన్‌-3 (పింక్‌ లైన్‌)ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నూతన మెట్రో రైలు(Pune Pink Line Metro) ఫొటోలను ఆయన ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. మాణ్‌ నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు మెట్రో స్టేషన్‌ వరకు 23 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ మార్గం ద్వారా ప్రధాన ఐటీ హబ్‌ హింజవడీ, ప్రముఖ ఉపాధి కేంద్రమైన శివాజీనగర్‌ మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

దేశంలోనే తొలిసారిగా మహిళా ఆపరేటర్లు.. 30 శాతం సౌర విద్యుత్‌తో రన్:

ఈ పింక్ లైన్ మెట్రోకు ఎంతో ప్రాధాన్యత ఉంది. 23 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ మార్గాన్ని పూర్తిగా మహిళా ఆపరేటర్లే నిర్వహించనుండటం దీని ప్రత్యేకత అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి వినూత్న వ్యవస్థ దేశంలోనే మొదటిదని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ లైన్‌ రోజువారీ విద్యుత్‌ అవసరాల్లో దాదాపు 30 శాతం మొత్తాన్ని సౌరశక్తి ద్వారానే సమకూర్చనున్నారు.

రూ.13,500 కోట్లతో ఫేజ్‌-2 పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన:

ఇదిలా ఉండగా, పుణె నగరంలో రవాణా కనెక్టివిటీని మరింత విస్తరించే లక్ష్యంతో రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పుణె మెట్రో ఫేజ్‌-2 పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఫేజ్‌లో భాగంగా లైన్‌ 2ఏ, 2బీ, లైన్‌ 4 మరియు 4ఏ మార్గాలను కలుపుకొని మొత్తం 44.39 కిలోమీటర్ల మేర నూతన మెట్రో లైన్లను నిర్మించనున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!