ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు.. రూ. 20 వేల మోటో G96 5G ఫోన్ ఇప్పుడు చాలా చీప్ గురూ..!

Must read

  • ఫ్లిప్‌కార్ట్‌లో మోటో G96 5జీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్
  • మోటో G96 5G బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా
  • 6.67-అంగుళాల ఫుల్ HD+ కర్వ్డ్ pOLED డిస్‌ప్లే

Moto G96 5G Flipkart : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మోటరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లతో మోటో G96 5జీ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ ధరకు లభిస్తోంది.. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరాలతో ఈ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మరి ఈ మోటో ఫోన్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి? ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం..

మోటో జీ96 5జీ ధర, డిస్కౌంట్ ఆఫర్లు :
మోటో జీ96 5జీ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.20,999కు లభిస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ రూ.19,949 ధరకు లభిస్తోంది. అంటే ప్రారంభంలోనే ధర తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు..

ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. మరింత ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ.1,050 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు.. అలాగే రూ.500 కూపన్ డిస్కౌంట్ పొందవచ్చు.. ఇలా మొత్తం మీద అసలు ధరతో పోలిస్తే రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు.. అయితే, బ్యాంక్, కూపన్ ఆఫర్లకు నిబంధనలు వర్తిస్తాయి. పూర్తి వివరాలు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ పేజీలో చెక్ చేయండి..

Read Also : 

మోటో జీ96 5జీ ఫీచర్లు :
ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్డ్ pOLED డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్పెషల్ అట్రాక్షన్ అందిస్తుంది.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హాలో యూఐపై రన్ అవుతుంది..

బ్యాటరీ విషయానికి వస్తే.. :
5,500mAh భారీ బ్యాటరీ ఇచ్చారు. 33W వైర్డ్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇక 5G, 4G, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.2, Wi-Fi, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మొత్తంగా అదిరే డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీతో బడ్జెట్‌లో 5జీ ఫోన్ కోసం చూస్తున్నవారికి మోటో జీ96 5జీ అద్భుతమైన ఆప్షన్..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!